Markapur: ఏకలవ్య కాలనీ రేషన్ షాప్‌లో తనిఖీలు డీలర్‌పై కేసు నమోదుకు ఆదేశం

Markapur: ఏకలవ్య కాలనీలోని రేషన్ షాప్–33 లో రికార్డుల్లో తేడాలు గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి. డీలర్‌పై కేసు నమోదుకు ఆదేశం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Sept 2026 12:35 PM IST
Markapur
X

Markapur: ఏకలవ్య కాలనీ రేషన్ షాప్‌లో తనిఖీలు డీలర్‌పై కేసు నమోదుకు ఆదేశం

Markapur: పట్టణంలోనీ ఏకలవ్య కాలనీలోని రేషన్ షాప్ నంబర్–33ను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని రేషన్ బియ్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన వివరాలకు, వాస్తవంగా ఉన్న బియ్యం నిల్వలకు తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

నిల్వలు, రికార్డుల మధ్య పొంతన లేకపోవడంపై చైర్మన్ ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అధికారులు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు ఉండకూడదని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ షాపులపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి, లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story