Erragondapalem: ఎర్రగొండపాలెం శిథిలావస్థలో ఎస్సీ హాస్టల్, జేఏసీ నిరసన

Erragondapalem: ఎర్రగొండపాలెంలో శిథిలావస్థకు చేరిన ఎస్సీ బాలుర హాస్టల్. కొత్త భవనం నిర్మించాలని జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన. అధికారులు నిర్లక్ష్యం వీడాలని డిమాండ్.

Srikanth Singam, Markapur
Published on: 15 July 2026 5:15 PM IST
Erragondapalem
X

Erragondapalem: ఎర్రగొండపాలెం శిథిలావస్థలో ఎస్సీ హాస్టల్, జేఏసీ నిరసన

ఎర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎస్సీ బాలుర హాస్టల్ శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజా సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలమై విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో భవనం మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. వెంటనే కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, హాస్టల్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సింగా ప్రసాద్ దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story