Addanki: సోలార్ ప్రాజెక్ట్ రైతులకు రూ. 31.57 కోట్ల పరిహారం పంపిణీ!

Addanki: అద్దంకిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన 37 మంది రైతులకు రూ. 31.57 కోట్ల పరిహారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ పంపిణీ చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 5 Aug 2026 6:47 PM IST
Addanki
X

Addanki: సోలార్ ప్రాజెక్ట్ రైతులకు రూ. 31.57 కోట్ల పరిహారం పంపిణీ!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం భారీ పరిహారాన్ని అందజేసింది.

రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (REMZ) ప్రాజెక్ట్–ఎల్‌ఏ ఫేజ్–1 కింద భూసేకరణకు సంబంధించిన పరిహార చెక్కులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు రైతులకు పంపిణీ చేశారు.

అద్దంకి డివిజన్ ఆర్డీఓ కార్యాలయంనందు, సంతమాగులూరు ,బల్లికురవ మండలాలకు చెందిన 37 మంది రైతులకు, సుమారు 175.41 ఎకరాల భూమికి రూ.31,57,38,000 పరిహార చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పంపిణీ చేశారు.

మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సేజు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దీనిలో భాగంగానే ఈరోజు భూమిని ఇచ్చిన రైతులకు పరిహారం కింద చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ తయారీ కేంద్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దీని ద్వారా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయని వీటిని నిర్మాణం చేపడితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మంత్రి తెలియజేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story