Markapuram: డ్రగ్స్‌పై కేంద్రం జీరో టాలరెన్స్ అభినందనీయం: ఏలూరి

Markapuram: డ్రగ్స్‌పై కేంద్రం జీరో టాలరెన్స్ విధానం అభినందనీయమని బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Sept 2026 7:47 PM IST
Markapuram
X

Markapuram: డ్రగ్స్‌పై కేంద్రం జీరో టాలరెన్స్ అభినందనీయం: ఏలూరి

మార్కాపురం జిల్లా: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారత్‌ సాధించాలనే లక్ష్యంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నార్కో సంస్థల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, యువతను డ్రగ్స్‌ బారినుంచి కాపాడేందుకు సమగ్ర చర్యలు అవసరమన్నారు.

డ్రగ్స్‌ రహిత భారత్‌ నిర్మాణం ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను మాదకద్రవ్యాల నుంచి రక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story