Markapur: గణేష్ మండపాలకు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి!

Markapur: మార్కాపురంలో వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ నాగరాజు సూచించారు. మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 10 Sept 2026 4:32 PM IST
Markapur
X

Markapur: గణేష్ మండపాలకు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి!

Markapur: వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మార్కాపురం డీఎస్పీ నాగరాజు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్‌లో మండపాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు పోలీస్ శాఖ నిబంధనలను పాటించాలని సూచించారు.

వేడుకల సమయంలో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విపరీతమైన శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పండుగను మార్చకూడదని డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు. ఇతరుల ప్రశాంతతకు భంగం కలగకుండా, నిబంధనలకు లోబడి వేడుకలను నిర్వహించాలని సూచించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖకు నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని డీఎస్పీ నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ, గ్రామీణ ఎస్సై లు విశ్వనాథరెడ్డి, వేమన పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story