Yerragondapalem: కులం పేరుతో దూషణ, దాడి.. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అట్రాసిటీ కేసు!

Yerragondapalem: చిన్నగుడిపాడులో రాజశేఖర్ దంపతులపై దాడి, చంపుతామని బెదిరింపులు. ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన దోర్నాల పోలీసులు.

Srikanth Singam, Markapur
Published on: 13 Sept 2026 11:17 AM IST
Yerragondapalem
X

Yerragondapalem: కులం పేరుతో దూషణ, దాడి.. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అట్రాసిటీ కేసు!

Yerragondapalem: పెద్ద దోర్నాల కులం పేరుతో దూషిస్తూ తనపై, తన భార్యపై దాడి చేశారని, అంతటితో ఆగకుండా తమ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన మాకం రాజశేఖర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య తెలిపారు.

రాజశేఖర్ ఫిర్యాదు ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఐనేని ఆంజనేయులు, వడ్డేపల్లి రాధాకృష్ణ తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని ఆరోపించారు. అనంతరం వారిద్దరూ తనపై దాడికి పాల్పడటంతో పాటు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భార్యపైనా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించినట్లు రాజశేఖర్ ఆరోపించారు.

ఈ ఘటనతో భయాందోళనకు గురై దోర్నాల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐనేని ఆంజనేయులు, వడ్డేపల్లి రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సైS. వెంకటరమణయ్య వెల్లడించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur