Dornala: మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి: ఎస్సై వెంకటరమణయ్య
Dornala: దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'మిషన్ హరిత ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎస్సై వెంకటరమణయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు.
Dornala: మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి: ఎస్సై వెంకటరమణయ్య
దోర్నాల: "మిషన్ హరిత ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఇంచార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దోర్నాల ఎస్సై వెంకటరమణయ్య నాయకత్వం వహించగా, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకటరమణయ్య మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో దోర్నాల పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మొక్కల సంరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.




