Dornala: గణేష్ ఉత్సవాలకు ఎస్ఐ వెంకటరమణయ్య మార్గదర్శకాలు
Dornala: దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, ఆన్‌లైన్ అనుమతి, డీజేల నిషేధంపై ఎస్ఐ స్పష్టత ఇచ్చారు.
Dornala: గణేష్ ఉత్సవాలకు ఎస్ఐ వెంకటరమణయ్య మార్గదర్శకాలు
దోర్నాల: దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని దోర్నాల ఎస్‌ఐ వెంకటరమణయ్య సూచించారు.
వినాయక చవితి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన చేయదలచిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు గణేశ్ ఉత్సవ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన అనంతరం లభించే క్యూఆర్ కోడ్‌ను మండపం వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.
వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో డీజే సౌండ్ సిస్టమ్స్, అధిక శబ్దం వచ్చే మైక్ సెట్ల వినియోగానికి అనుమతి లేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు. కాబట్టి డీజేలకు ముందుగా అడ్వాన్స్ చెల్లించవద్దని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, డ్రమ్స్, మేళాలు వంటి సాంప్రదాయ కార్యక్రమాలను నిబంధనలకు లోబడి నిర్వహించుకోవచ్చని తెలిపారు. ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరిస్తూ శాంతియుతంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని దోర్నాల పోలీసులు కోరారు.




