Dornala: ప్రభుత్వ ధరలకే యూరియా, డీఏపీ అమ్మాలి ఏడీఏ ఈ.వీ. రమణ హెచ్చరిక!

Dornala: వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన రెండు ఎరువుల దుకాణాల్లో రూ.6.72 లక్షల విలువైన అమ్మకాలను తక్షణమే నిలిపివేశారు.

Srikanth Singam, Markapur
Published on: 14 July 2026 11:24 PM IST
Dornala
X

Dornala: ప్రభుత్వ ధరలకే యూరియా, డీఏపీ అమ్మాలి ఏడీఏ ఈ.వీ. రమణ హెచ్చరిక!

దోర్నాల: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను యర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకుడు ఈ.వి. రమణ, మండల వ్యవసాయ అధికారి డి. జవహర్ లాల్ నాయక్‌తో కలిసి తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా APAIMS 2.0 యాప్ ద్వారా అనుమతించిన మేరకే యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా బస్తాను రూ.266.50, డీఏపీ బస్తాను రూ.1,350కు విక్రయించాలని ఆదేశించారు. రైతులు కోరిన యూరియా, డీఏపీ ఎరువులను ఇతర ఎరువుల కొనుగోలుతో సంబంధం లేకుండా అందించాలని స్పష్టం చేశారు.

తనిఖీలలో భాగంగా శ్రీ గురు సాయి ట్రేడర్స్‌లో ఒరిజినల్ లైసెన్స్‌లో ఫారం–ఓ నమోదు లేకపోవడంతో రూ.3,25,800 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. అలాగే శ్రీ లక్ష్మి సాయిబాబా ట్రేడర్స్‌లో కూడా ఫారం–ఓ నమోదు లేకపోవడంతో రూ.3,46,600 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు అవసరమైన మేరకే ఎరువులు కొనుగోలు చేసేలా డీలర్లు వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఎరువుల అమ్మకాలలో నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీలలో మండల వ్యవసాయ అధికారి డి. జవహర్ లాల్ నాయక్ పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story