Dornala: పెద్దదోర్నాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవ ర్యాలీ
Dornala: పెద్దదోర్నాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవం వేడుకలు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ, వ్యాసరచన పోటీలు.
Dornala: పెద్దదోర్నాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవ ర్యాలీ
దోర్నాల: మార్కాపురం జిల్లా,...!!! పెద్దదోర్నాల అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దదోర్నాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి నటరాజ్ సెంటర్ వరకు విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్న ర్యాలీ నిర్వహించి పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్యను పెంచడం, వాటి సహజ ఆవాసాలను కాపాడడం, వేటను అరికట్టడం, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని వివరించారు. పులులు అడవుల సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్‌ఓ, ఎఫ్‌బీఓ ఎస్.ఏ. జబ్బర్, ఎఫ్‌బీఓ చెన్నయ్య, ఎఫ్‌బీఓ కృష్ణవేణి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.




