Prakasam: టీడీపీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ ఎంతో ఉపయోగకరం: దర్శి ఇన్‌చార్జి!

Prakasam: ప్రజలకు చేరువగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలని దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళగిరి లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో ఆమె పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 8 Sept 2026 11:40 PM IST
Prakasam
X

Prakasam: టీడీపీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ ఎంతో ఉపయోగకరం: దర్శి ఇన్‌చార్జి!

ప్రకాశం: ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా నాయకులు పనిచేయాలని దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కాన్‌క్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకత్వ లక్షణాల పెంపుదల, ప్రజలతో నిరంతర సంబంధాలు, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడం తదితర అంశాలపై కాన్‌క్లేవ్‌లో చర్చించినట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత తదితర అంశాలపై తన అనుభవాలను పంచుకున్నట్లు చెప్పారు.

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, బూత్‌ కమిటీలను చురుకుగా పనిచేయించడం, యువత, మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలపై మార్గదర్శకత్వం లభించిందన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story