Darsi: దర్శి మండలం సాయినగర్‌లో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు!

Darsi: ప్రకాశం జిల్లా దర్శి మండలం సాయినగర్‌లో తాగునీటి సమస్యపై రోడ్డెక్కిన గ్రామస్తులు.. అధికారుల స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2026 12:17 PM IST
Darsi
X

Darsi: దర్శి మండలం సాయినగర్‌లో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు!

Darsi: తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ దర్శి మండలం సాయినగర్‌ గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామానికి తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదంటూ శనివారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?

గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆరోపించారు. తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకు సైతం నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు.

ఎన్నికల హామీలు ఎక్కడ?

ఎన్నికల సమయంలో గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పుడు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్