Chirala: చీరాలలో విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఫ్లెక్సీ!

Chirala: చీరాల పార్క్ సెంటర్‌లో విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా ఫ్లెక్సీ. తక్షణమే తొలగించాలని స్థానికులు, వాహనదారుల విజ్ఞప్తి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 31 Aug 2026 1:29 PM IST
Chirala
X

Chirala: చీరాలలో విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఫ్లెక్సీ!

Chirala: చీరాల పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్క్ సెంటర్‌లో విద్యుత్ తీగలకు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫ్లెక్సీ ఫ్రేమ్ ప్రమాదకరంగా వంగి తీగలపై పడిపోయింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలోనైనా ఫ్లెక్సీ ఫ్రేమ్ విద్యుత్ తీగలపై నుంచి జారిపడి ప్రజలపై పడే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.

ఇప్పటికే ప్రమాదకర స్థితికి చేరిన ఫ్లెక్సీ ఫ్రేమ్‌కు తోడు వాతావరణంలో మార్పులు, బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదాన్ని నివారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story