Markapuram: వెలుగొండ పాటల సీడీని ఆవిష్కరించిన కలెక్టర్ విజయ సునీత!
Markapuram: వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతపై డోలా శ్యామలాదేవి రచించిన 'వెలుగుల జలధారా' పాట సీడీని మార్కాపురంలో కలెక్టర్ విజయ సునీత ఆవిష్కరించారు.
Markapuram: వెలుగొండ పాటల సీడీని ఆవిష్కరించిన కలెక్టర్ విజయ సునీత!
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను, మార్కాపురం ప్రాంత ప్రజల ఆశలను, రైతుల భవిష్యత్ ను, ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మార్కాపురం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని డోలా శ్యామలాదేవి రచించిన “వెలుగొండ జలధారా – వెలుగుల జలధారా” పాటకు సంబందించిన సీడీ ని మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆవిష్కరించారు.
ప్రాజెక్టు ద్వారా వచ్చే జలాలు ఈ ప్రాంతానికి కేవలం సాగునీటిని మాత్రమే కాకుండా రైతులకు భరోసా, ప్రజలకు ఆశ, మార్కాపురం ప్రాంతానికి అభివృద్ధి, భవిష్యత్ తరాలకు సుసంపన్నమైన జీవనాన్ని అందించే వెలుగుల జలధారగా మారాలని ఆకాంక్షిస్తూ ఈ పాటను రూపొందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామలాదేవి ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




