Prakasam: అర్జీదారులతో మర్యాదగా ప్రవర్తించండి.. అధికారులకు ఆదేశం

Prakasam: ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ విజయ సునీత 168 అర్జీలను స్వీకరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 April 2026 5:54 PM IST
Prakasam
X

Prakasam: అర్జీదారులతో మర్యాదగా ప్రవర్తించండి.. అధికారులకు ఆదేశం

Prakasam: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల తృప్తి మేరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.

రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించడానికి రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయాలని ఆమె చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ట్రీ ఓపెన్ కాకుండా సానుకూలంగా పరిష్కరించడం తీసుకోవాలి అధికారులకు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల తృప్తి మేరకు సమస్యలను పరిష్కరించాలని ఆమె చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి అర్జీలుదారు లతో మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 168 అర్జునులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ సంబంధించిన 112, ఇతర సమస్యలపై 56 అర్జీలు వచ్చినట్లు వివరించారు. అదే విధంగా జిల్లాలో జరుగుతున్న జనాభా గణాంకాలు, ప్రభుత్వ పథకాలకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు.

జిల్లాలో రీ సర్వే కార్యక్రమాలు వేగంతో చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని క్రింది స్థాయి అధికారులకు హాజరు కాకూడదనిఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి శివరామిరెడ్డి, జిల్లా అధికారులు తదితరు లు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story