Markapur: ఎస్‌ఐఆర్ పనులు మందకొడితే చర్యలు!
Markapur: డ్రైవర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ ఎం. విజయ సునీత. పనులు మందగించడంపై అసంతృప్తి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం.
Markapur: ఎస్‌ఐఆర్ పనులు మందకొడితే చర్యలు!
Markapur: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఎన్యుమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా పరిశీలించారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిజిటలైజేషన్ పనుల పురోగతిని పరిశీలించగా, ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని గమనించారు. గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ప్రతి ఇంటి వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేసి, వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.




