Markapuram: వెలిగొండ ముంపు గ్రామాల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన!

Markapuram: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని, అర్హులకు పట్టాలు పంపిణీ చేశారు

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 Aug 2026 3:26 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ ముంపు గ్రామాల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత జిల్లాస్థాయి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఎమ్మార్వో చిరంజీవి తో కలిసి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

పర్యటనలో భాగంగా నిర్వాసితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అర్హులైన నిర్వాసితులకు పట్టాలను పంపిణీ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ విజయ సునీత తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story