Markapur: మార్కాపురం జిల్లాలో పెన్షన్ దరఖాస్తులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Markapur: మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో నూతన పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఎం. విజయ సునీత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Sept 2026 2:57 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లాలో పెన్షన్ దరఖాస్తులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Markapur: మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో నూతన పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 16వ తేదీతో పెన్షన్ దరఖాస్తులకు గడువు ముగియనున్న నేపథ్యంలో, పొదిలి ఎంపీడీవో కార్యాలయం, సచివాలయం-5, తలమల్ల సచివాలయాలను కలెక్టర్ సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.

ఇప్పటివరకు ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎల్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి దరఖాస్తుల పురోగతిపై వివరాలు సేకరించారు.

పెండింగ్ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని, రానున్న 48 గంటల్లో పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను స్పష్టంగా ఆదేశించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM