Markapur: మార్కాపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ విజయ సునీత సత్కారం!

Markapur: మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 5 Sept 2026 2:13 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ విజయ సునీత సత్కారం!

మార్కాపురంలో: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ, విద్యార్థులను క్రమశిక్షణతో, సన్మార్గంలో నడిచేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి, విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలని కోరారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఈఓ సుబ్బారావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story