Giddalur: ఈనెల 27న సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లిలో ఈనెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Jun 2026 3:45 PM IST
Giddalur
X

Giddalur: ఈనెల 27న సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లిలో ఈనెల 27న జరిగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.

మంగళవారం మార్కాపురం కలెక్టరేట్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అధికారులకు అప్పగించిన పనులను గడువులోపు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

సభా ప్రాంగణానికి సమీపంలో రైల్వే ట్రాక్ ఉన్నందున భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే మెప్మా, వ్యవసాయ, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ తదితర శాఖలు ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సీఎం పర్యటన విజయవంతం చేయడం అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవోలు ఎం. వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్, డీఎస్పీ నాగరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story