Prakasam: రామకూరులో కలెక్టర్ రాజాబాబు పర్యటన

Prakasam: చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపాలని అధికారులకు ఆదేశం.. తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు.

Kolla Singaiah, Addanki
Published on: 1 Jun 2026 7:19 PM IST
Prakasam
X

Prakasam: రామకూరులో కలెక్టర్ రాజాబాబు పర్యటన

ప్రకాశం: నాగార్జునసాగర్ నుంచి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకునేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులుకు జిల్లా కలెక్టర్.పి. రాజాబాబు చెప్పారు. సోమవారం జె.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామంలో నాగార్జునసాగర్ నుంచి వస్తున్న కాలువను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణము, ప్రవాహ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్రాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని అన్ని చెరువులను పూర్తిస్థాయి నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని, పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

జిల్లాలోకి వస్తున్న నీటి పరిమాణం, చెరువులను నింపుతున్న వివరాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఈ.ఈ.సతీష్, జిల్లా అధికారులు ఉన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story