Markapuram: వెలుగొండ కెనాల్‌లో గణేశ్ నిమజ్జనానికి అనుమతి లేదు: సీఐ!

Markapuram: దోర్నాల పరిధిలోని వెలుగొండ ఫీడర్ కెనాల్, ప్రాజెక్ట్ టన్నెల్‌లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 14 Sept 2026 9:45 PM IST
Markapuram
X

Markapuram: వెలుగొండ కెనాల్‌లో గణేశ్ నిమజ్జనానికి అనుమతి లేదు: సీఐ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించే విషయంలో ప్రజలు, భక్తులు మరియు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని యర్రగొండపాలెం CI అజయ్ కుమార్ సూచించారు.

దోర్నాల మండల పరిధిలోని వెలుగండ ఫీడర్ కెనాల్‌లో గానీ, వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్‌లో గానీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అధికారిక అనుమతులు లేవు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి లేని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడం వల్ల,ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నందున నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరుతున్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు సూచించిన మరియు అనుమతి కలిగిన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించవలసినదిగా ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ తెలియజేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur