Chirala: మహిళల రక్షణకు శక్తి యాప్, డయల్ 112 పై అవేర్నెస్ డ్రైవ్
Chirala: బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని DRM హ్యాండ్లూమ్స్లో మహిళల భద్రత, సైబర్ నేరాలపై శక్తి బృందం అవగాహన సదస్సు.
Chirala: మహిళల రక్షణకు శక్తి యాప్, డయల్ 112 పై అవేర్నెస్ డ్రైవ్
Chirala: చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు శక్తి బృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ ఎండి మొయిన్న పర్యవేక్షణలో టూ టౌన్ సిఐ శశికుమార్ ఆధ్వర్యంలో శక్తి బృందం కానిస్టేబుల్ కే. సుబ్బారావు DRM హ్యాండ్లూమ్స్లో పనిచేస్తున్న మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ మోసాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలు వినియోగం, శక్తి యాప్ ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
Next Story




