Markapuram: E20 పెట్రోల్ దేశ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్: బీజేపీ నేత!

Markapuram: ప్రధాని మోదీ నాయకత్వంలో E20 పెట్రోల్ దేశ భవిష్యత్తుకు కీలకంగా మారిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Aug 2026 7:12 PM IST
Markapuram
X

Markapuram: E20 పెట్రోల్ దేశ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్: బీజేపీ నేత!

మార్కాపురం: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఇంధన స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనం) దేశ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

ఇథనాల్ బ్లెండింగ్ వల్ల విదేశీ క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మెరుగైన మార్కెట్ లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని చెప్పారు.

E20 పెట్రోల్‌తో వాహనాల కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు.

రైతు సంక్షేమం, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి ఇథనాల్ విప్లవం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి భారతీయుడు దీనికి మద్దతు ఇవ్వాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story