Markapuram: మార్కాపురం నియోజకవర్గ బీజేపీ BLA-1గా విజయలక్ష్మి నియామకం!

Markapuram: మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్-1 (BLA-1)గా బెల్లంకొండ విజయలక్ష్మి నియమితులయ్యారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Jun 2026 8:07 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం నియోజకవర్గ బీజేపీ BLA-1గా విజయలక్ష్మి నియామకం!

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి బూత్ లెవల్ ఏజెంట్-1 (BLA-1)గా బెల్లంకొండ విజయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు PVN మాధవ్ విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.

BLA-1 అనేది ఎన్నికల కమిషన్‌తో సమన్వయం చేసుకునేందుకు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు నియమించే అధికారిక ప్రతినిధి. ఈ బాధ్యతల్లో భాగంగా ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)లతో నిరంతరం సమన్వయం కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల కమిషన్ నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–Special Intensive Revision) ప్రక్రియపై BLA-2లకు అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు మిగిలిపోకుండా చూడడం, దొంగ ఓట్ల సృష్టికి అవకాశం లేకుండా పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలు BLA-1పై ఉంటాయి.

అలాగే ప్రతి మండల పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుని BLA-2 నియామకాలను పూర్తి చేసి, సంబంధిత జాబితాలను BLO, EROలకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సమర్థవంతమైన ఓటరు నమోదు కోసం BLA-1 కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా బెల్లంకొండ విజయలక్ష్మికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story