Giddalur: కులం పేరుతో దూషించి దాడి చేశారు: బాధితుడు రమణయ్య ఆవేదన!

Giddalur: మణయ్యపై జరిగిన దాడిని నిరసిస్తూ యాదవ సంఘం నాయకులు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 16 July 2026 5:23 PM IST
Giddalur
X

Giddalur: కులం పేరుతో దూషించి దాడి చేశారు: బాధితుడు రమణయ్య ఆవేదన!

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరులో పంచాయతీ కార్యదర్శి రమణయ్య పై దాడి జరగడాన్ని నిరసిస్తూ యాదవ సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్యని కలిసి పంచాయతీ కార్యదర్శి రమణయ్య పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని యాదవ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.

ఈనెల 14వ తేదీన కొమరోలు మండలం దద్దవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై స్థానిక ఐదు మంది టీడీపీ నాయకులు బిల్లులు చెల్లించే విషయంలో దాడికి పాల్పడినట్లు కార్యదర్శి రమణయ్య వాపోయాడు. బిల్లులు చెల్లించే విషయంలో ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడతారని చెప్పిన తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని తీరా ఎమ్మెల్యేకి చెప్తారని చెబితే దిక్కున చోట చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడి దాడి చేసినట్లు రమణయ్య తెలిపాడు.

ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు కేసు నమోదు చేయలేదని వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు బొర్రా శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేశారు. స్పందించకపోతే 2029 ఎన్నికలలో యాదవులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాస యాదవ్ అన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story