Prakasam: పొదిలిలో ఈ నెల 17న విద్యుత్ అదాలత్: ఈఈ ఉమాకాంత్!

Prakasam: ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 17న ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నారు. సమస్యలున్న వినియోగదారులు అర్జీలు ఇవ్వాలని ఈఈ ఉమాకాంత్ కోరారు.

MADARVALI, MARKAPURAM
Published on: 15 Sept 2026 6:34 PM IST
Prakasam
X

Prakasam: పొదిలిలో ఈ నెల 17న విద్యుత్ అదాలత్: ఈఈ ఉమాకాంత్!

Prakasam: ఏపీసీపీడీసీఎల్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్‌ఎఫ్), విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన పొదిలిలో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు కనిగిరి డివిజన్ ఈఈ ఆర్. ఉమాకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పొదిలి పట్టణంలోని రథం రోడ్డులో ఉన్న సాయి బాలాజీ కళ్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్, ఫోరం సభ్యులు, మార్కాపురం ఎస్‌ఈ సయ్యద్ అబ్దుల్ కరీంతో పాటు ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు.

కనిగిరి డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను అర్జీల రూపంలో సమర్పించి పరిష్కరించుకోవచ్చని ఈఈ సూచించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM