Markapuram: త్వరలో ఎస్సీ కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
Markapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల దాసుకు మార్కాపురం కుంట జంక్షన్ వద్ద దళిత నేతలు ఘన సన్మానం చేశారు.
Markapuram: త్వరలో ఎస్సీ కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల దాసు నంద్యాల జిల్లా ఆత్మకూర్లో ఫీల్డ్ విజిట్ పూర్తి చేసుకుని విజయవాడకు తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కుంట జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దళిత నాయకులు లింగాల అబ్రహం, ఉప్పలపాటి చిన్న యేసు, కొంగలేటి అనిల్ కుమార్, బలుసుపాటి దానం తదితరులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల అబ్రహం నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలు, దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎస్సీ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మేకల దాసు మాట్లాడుతూ, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారితో చర్చించి ఈ నెలాఖరులోగా మార్కాపురం జిల్లాలో జిల్లా స్థాయి ఎస్సీ కమిషన్ రివ్యూ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించబడుతుందని, అన్ని శాఖల అధికారులతో కలిసి దళితుల సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని వెల్లడించారు.
దళితుల సమస్యల పరిష్కారానికి ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, త్వరలో జరగనున్న ఈ సమావేశం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.




