Banswada: కొయ్యగుట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం!

Banswada: బాన్సువాడ సమీపంలోని కొయ్యగుట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొండాపూర్ గ్రామానికి చెందిన సుభాష్ గౌడ్ (32) మృతి చెందారు.

SALEEM, BANSWADA
Published on: 17 Aug 2026 11:05 PM IST
Banswada
X

Banswada: కొయ్యగుట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం!

బాన్సువాడ: బాన్సువాడ సమీపంలోని కొయ్య గుట్ట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సుభాష్ గౌడ్ 32 సంవత్సరాలు నాగుల పంచమి సందర్భంగా కొమలంచలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి బాన్సువాడ మీదుగా కొండాపూర్ కు తిరిగి వెళ్తున్నాడు.

ఈ క్రమంలో కొయ్య గుట్ట పెట్రోల్ పంపు వద్ద గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో సుభాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

కుటుంబంలో విషాదం మృతుడు సుభాష్ గౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సుభాష్ అకాల మరణంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.ప్రమాదానికి సంబంధించి బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story