Banswada: బాన్సువాడలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Banswada: బాన్సువాడలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను బుధవారం ఘనంగా జరుపుకున్నారు . కెమెరా సృష్టికర్త లూయిస్- జాకాస్ - మండే డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మాటల్లో చెప్పలేని భావాలను కాలంలో ఆగిపోయిన జ్ఞాపకాలను ఒక్క క్లిక్ తో శాశ్వతంగా నిలిపే అద్భుత కలే ఫోటోగ్రఫీ అని తెలియజేశారు. సీనియర్ ఫోటోగ్రఫీ పెద్దలకు సన్మానం చేయడం జరిగింది.
అందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అరుణ్. ఉపాధ్యక్షులు నదీమ్. సెక్రటరీ పత్తి సాయిలు. క్యాషియర్ కృష్ణ సలహాదారులు. సురేష్ గౌడ్. గంగాధర్ యాదవ్. మధుసూదన్. గోపాల్ గౌడ్. మోహన్. గోవర్ధన్. దత్తు. చంద్రశేఖర్. రమేష్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




