Nizamabad: కంట్లో కారం చల్లి బంగారు ఆభరణం అపహరణ!

Nizamabad: వర్ని మండలం జలాల్‌పూర్‌లో మహిళ కంట్లో కారం కొట్టి 3 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 27 Aug 2026 6:02 AM IST
Nizamabad
X

Nizamabad: కంట్లో కారం చల్లి బంగారు ఆభరణం అపహరణ!

Nizamabad: వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో ఒకరి ఇంట్లో చోరబడి మూడు తులాల బంగారు ఆభరణాన్నిమెడలోంచి ఎత్తుకెళ్లిన మహిళ. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చందూర్ మండలం, కారేగాం తండాలో పట్టపగలే ఇంట్లో చోరీ ఘటన మరవక ముందే జలాల్ పూర్ గ్రామానికి చెందిన దొడ్డికింది కవిత ఇంట్లో అదే గ్రామానికి చెందిన బుషిగంప నాగలక్ష్మి అనే మహిళ చోరబడి మూడు తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లినట్టు వర్ని ఎస్.ఐ. వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో కవిత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే కాలనీకి చెందిన నాగలక్ష్మి ఇంట్లో చొరబడి కవిత కంట్లో కారం చల్లి మెడలోని మూడు తులాల బంగారు ఆభరణాన్ని దొంగలించినట్లు ఎస్.ఐ. తెలిపారు.

బాధితురాలు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగతనానికి పాల్పడిన నాగలక్ష్మి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్.ఐ. తెలిపారు. ప్రజలు అప్రమతంగా ఉండాలని ,గుర్తు తెలియని కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆయన తెల్పారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story