Nandipet: ఐలాపూర్‌లో చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై హెచ్చరిక!
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై వినయ్ తెలిపారు.
Nandipet: ఐలాపూర్‌లో చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై హెచ్చరిక!
Nandipet: వినాయక చవితిని ప్రతి ఒక్కరూ శాంతి యుతంగా జరుపుకోవాలని ఎక్కడ డీజేలు పెట్టకూడదని ఒకవేళ పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని నందిపేట్ ఎస్సై వినయ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలపూర్ గ్రామంలో యువకులు, గణపతి మండపం నిర్వాహకులు గ్రామ ప్రజలు వీడిసి సభ్యులు, గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఎస్సై వినయ్ మాట్లాడుతూ వినాయక చవితికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని డీజేలు పెట్టడం, మద్యం సేవించడం ద్వారా దాని పవిత్రతను నాశనం చేయకూడదని అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైనా డీజే లు పెట్టడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ముఖ్యంగా యువత గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా గంజాయి తాగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్సై తెలిపారు. వీటితో పాటు సైబర్ నేరాల వంటి వాటికి యువత దూరంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ గాదె శ్రీను, మేకల సురేష్ , ఐనర్ల అఖిల్ వార్డు మెంబర్లు, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, విడిసి అధ్యక్షులు షేర్ల వెంకట్, విడిసి సభ్యులు, యువకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.




