Varni: జాకోరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పోచారం
Varni: వర్ని మండలం జాకోరలో మహిళా సంఘ భవనం, PACS దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
Varni: జాకోరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పోచారం
వర్ని: వర్ని మండలంలోని జాకోర గ్రామo లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై తన చేతులమీదుగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
జాకోర గ్రామంలో SDF నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం.
జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం మరియు ప్రహరీ గోడను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలోబోధన్ ఆర్ డి ఓ విజయ కుమారి ,సర్పంచ్ సాయిలు,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.
Next Story




