Bodhan: జీవనోపాధిపై దెబ్బ.. ఎక్సైజ్ సీఐని ఆశ్రయించిన గౌడన్నలు!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పశువాగు శివారులో 60 ఈత చెట్లను దుండగులు నరికి కాల్చివేశారు.

K RAVI, BODHAN
Published on: 10 May 2026 9:24 AM IST
Bodhan
X

Bodhan: జీవనోపాధిపై దెబ్బ.. ఎక్సైజ్ సీఐని ఆశ్రయించిన గౌడన్నలు!

నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని పశువాగు శివారులో గల ఈత చెట్లను గుర్తుతెలియందు నరికివేసి కాల్చివేయడంతో గీత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ భాస్కరరావును శనివారం గీత వృత్తి కార్మికులు కలిసి ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్ 594 లో సుమారు 8 ఎకరాల 6 గుంటల భూమిలో ఈతవనాలను పెంచు గీత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని వినతిపత్రంల వివరించారు. గుర్తుతెలియని దుండగులు సుమారు 60 ఈత వనాలను నరికివేసి దగ్ధం చేశారని దీంతో తమ కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాణ్యమైన కల్లును అందించేందుకు తమ గీత కార్మికులు రాత్రి కష్టపడుతున్నారని ఈ ఈత వనాల నుండి వచ్చే కళ్ళును విక్రయించి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దుండగులను గుర్తించి కఠిన కఠినంగా శిక్షించడంతోపాటు తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐని విజ్ఞప్తి చేశారు. సిఐ ని కలిసిన వారిలో గంగాధర్ గౌడ్ లింగాగౌడ్, శ్రీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్ రాజేందర్ గౌడ్ ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story