Kamareddy: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులో ఘోర ప్రమాదం!

Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

VEERANNA, JUKKAL
Published on: 15 July 2026 6:43 PM IST
Kamareddy
X

Kamareddy: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులో ఘోర ప్రమాదం! 

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దినకర్మ కార్యక్రమానికి గాను ఫోటో , సామాగ్రి తీసుకొచ్చేందుకు గాను గొర్గల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జుంజురు దినేష్ (24), జుంజురు రమేష్ లు కలిసి ద్విచక్ర వాహనం పై పిట్లం కు వెళ్ళి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని క్రషర్ మిషన్ మూల మలుపు వద్ద వెనుకనుండి గుర్తు తెలియని ఓ వాహనం ఢీ కొట్టిన ఘటన లో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో జుంజురు దినేష్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడు జుంజురు రమేష్ ను స్థానికులు వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ క్షతగాత్రుని ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి కి అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. దినకర్మ రోజే ఇద్దరు యువకులు మృత్యు వాత పడడంతో గోర్గల్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఒకే ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న సాగర్ ఎస్సే జె. శివ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించి అప్రమత్తమై సి సి పుటేజ్ ద్వార ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొన్న వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story