Nizamabad: ప్రేమ.. మోసం.. చివరకు పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకడమే పరిష్కారమా?
Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.
Nizamabad: ప్రేమ.. మోసం.. చివరకు పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకడమే పరిష్కారమా?
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ పోలీస్ స్టేషన్ పాత భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసారు. బాల్కొండ మండలకేంద్రానికి చెందిన వివాహితుడైన యువకుడు యువతిని ప్రేమించి మోసం చేశాడని యువతిని యువకుడు పెళ్లి చేసుకోవాలని మనస్థాపంతో పోలీస్ స్టేషన్ భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యయత్నం చేసింది. అక్కడే ఉన్న ఇద్దరు ప్రశాంత్, సతీష్ కానిస్టేబుళ్లు అప్రమత్తమై యువతికి అడ్డుకోవడంతో తలకు బలమైన గాయాలు తగలలేదు యువతికి కొద్దిపాటి గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం నిజామాబాదు హాస్పత్రికి తరలించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాల్కొండ పోలీసులు.
Next Story




