Armoor: ఆర్మూర్ ఆర్యవైశ్యుల సత్తా.. రాష్ట్ర కార్యదర్శిగా పోల సుధాకర్!
Armoor: ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ కార్యదర్శిగా ఎన్నికైన పోల సుధాకర్‌కు ఘన సన్మానం.
Armoor: ఆర్మూర్ ఆర్యవైశ్యుల సత్తా.. రాష్ట్ర కార్యదర్శిగా పోల సుధాకర్!
అర్మూర్: ఆర్మూర్ పట్టణం శ్రీ కన్య కా పరమేశ్వరి దేవాలయంలో రాష్ట్ర మహాసభ కు కార్యదర్శిగా నిమ్మితులైన పట్టణ సంఘ సభ్యులు పోల సుధాకర్ కు ఆర్మూర్ వైశ్యా మండల సభ్యులు, పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘన సన్మానం.
పట్టణ సంఘం అధ్యక్షులు: తమ్మి శ్రీనివాస్
ఈ సందర్భంగా తమ్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సభకు హాజరైన సభ్యులందరికీ ధన్యవాదములు తెలుపుతూ మన ఒక సంఘ భవనం గాని ఈ రకంగా, మా సంఘ కుటుంబాలు అందరూ బాగా ఉంటున్నారంటే అది మన వాసవి అమ్మవారి దయ, మన కుటుంబాలు అంతా కలిసి మన గుడి నిర్మాణాన్ని ఇంత మంచిగా నిర్మించుకున్న అంటే, ఇప్పుడున్న ఉన్న కుటుంబాలు సహకరించడం కాకుండా, అప్పట్లో మా సంఘ పెద్దలు వారు అధ్యక్షుడు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలకు, గుడి నిర్మాణం, నాగేశ్వర గుడి నిర్మాణ కు పెద్దలంతా ఎంతో సహాయం చేశారు, వారిని మనం ఎప్పుడు కూడా మరువకూడదు, ఇప్పుడు కూడా మనం ఒక సంఘ గుడి పనులకు, ఏదైనా చేద్దామనుకుంటే, అది చక చక ముందుకు వెళుతుంది.
అదంతా నా ఒక్కడితోనే కాకుండా, మనది అనుకున్న మా సంఘ కుటుంబ సభ్యులది అంటూ ఏదున్నా గాని ఆ ఒక్క వాసమ్మ దయ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, మన సంఘ పెద్దలు బొంపల్లి బాబురాజు ఇటీవలే మరణించడంతో అది మన సంఘానికి చాలా బాధాకర విషయం, అతను చనిపోయినందున, వారి ఆత్మకు శాంతి కలగాలని, మనమంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి, మన సంఘ మంచి పేరు ఉండి రాష్ట్రంలోనే, ఎందుకంటే మన సంఘం ఏ విషయం కానా అభివృద్ధి కోసం, మనం ఎవరిని అడగము, ఎవరి దగ్గర కూడా ఏం తీసుకోము, కేవలం మన సంఘ కుటుంబాలతోని ఏ పనైనా మనకి మనమే అంతా కలిసి సాధ్యం చేసుకుంటాము, ఇకపై ఏ పని, ఏం నిర్మించాలన్న, ఇలానే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తామంటూ మాట్లాడారు.
కార్యదర్శి గా సన్మానం పొందిన పోల సుధాకర్ :
ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు వచ్చిన వారందరికీ నమస్కారం, నేను గతంలో 2011 వ సంవత్సరంలో మన ఆర్యవైశ్య కులానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు, జిల్లాలో ఉన్న 36 మండలలకు వెళ్లి, అక్కడ కార్యవర్గం ఏర్పాటు చేసి, జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా గాని, నేను ముందుండి నడిపాను, నాకు గతంలో ఆరోగ్యం బాగా లేకుంటే, తిరిగి మళ్ళీ మంచిగైన అంటే కేవలం అది వాసవి అమ్మవారి దయని, వాసవి మాతకు నేను సేవ చేస్తున్నందున, దయ చూపి నన్ను కాపాడింది.
కాబట్టి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆర్యవైశ్య మహాసభకు రాష్ట్ర కార్యదర్శి కావడం, కేవలం నాకు ఇక్కడనే కాకుండా అన్ని జిల్లాలలో, వేరే వేరే రాష్ట్రంలో పోల సుధాకర్ అంటే ఆర్మూర్ అని ఒక గుర్తింపు ఉంది, అలాగే వైశ్య కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చిన గాని, వారికి నేను ముందు ఉంటానని ఈ సభ ముఖంగా చెప్పడం జరుగుతుంది, మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు అంతా సెట్ అయ్యారు, ఇప్పుడు కేవలం నేను ఉన్నది అమ్మవారికి సేవ చేయడానికి అంటూ మాట్లాడారు, ఎవరికి ఏ ఆపద వచ్చినా గాని నా మొబైల్ నెంబర్ కు కాల్ చేస్తే, నేను వెంటనే సహాయం చేస్తానందుకు సభాముఖంగా చెప్పడం జరిగింది. మన ఆర్మూర్ పట్టణ సంఘ సభ్యులంతా ఇలాగే ఐక్యమత్యం ఉంటూ, మనం ఒక గుడికి, సంఘానికి అభివృద్ధికి మన పూర్వ పెద్దలు ఎలా కొనసాగించారు, ఇప్పుడు మనం అలాగే కొనసాగిస్తున్న, భవిష్యత్తు మన కుటుంబ పిల్లలు కూడా ఈ రకంగా కొన్ని సాధించాలని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండా అంబరీష్, ఆర్య వైశ్య జిల్లా ఉపాధ్యక్షులు నరాల తుక్కారం, కందుకూరి తిమ్మయ్య, ఆర్యవైశ్య మండల ప్రధాన కార్యదర్శి చింత సుధాకర్, పట్టణ యువజన సంఘం మాజీ అధ్యక్షులు ముక్క లక్ష్మణ్, సంఘ సభ్యులు అయినటువంటి హెచ్ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్ అల్లాడి వంశీకృష్ణ, సంఘ సభ్యులు, మండల సభ్యులు పాల్గొన్నారు.




