Banswada: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన పోచారం

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 1 Aug 2026 7:17 PM IST
Banswada
X

Banswada: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన పోచారం

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .

ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యాసాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు.ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతూ విద్యే భవిష్యత్తుకు బాటవేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు.సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థిని లక్ష్మీ మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో హాస్టల్ నుండి కాలేజీ కి రావడానికి ప్రయాణ ఇబ్బందులను గమనించి వెంటనే మా గురించి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన పోచారం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నత విద్య కొరకు SRNK డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే బాన్సువాడ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చిన పోచారం కు విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సలాం గారు, కాలేజీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, బోధన సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story