Banswada: ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో 108 మట్టి వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు!

Banswada: బాన్సువాడ ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో విద్యార్థులతో 108 మట్టి వినాయక ప్రతిమల తయారీ, ప్రత్యేక పూజలు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయమన్న పాఠశాల డైరెక్టర్.

SALEEM, BANSWADA
Published on: 14 Sept 2026 3:25 PM IST
Banswada
X

Banswada: ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో 108 మట్టి వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు!

Banswada: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు మట్టి వినాయకుల ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశంతో బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 108 మట్టి వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 108 మట్టి వినాయక ప్రతిమలను పాఠశాల ఆవరణలో ప్రతిష్ఠించి, వినాయక చవితి సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వేద సాహితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు.

విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు, మట్టి వినాయకుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలనే ఉద్దేశంతో 108 మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేయించినట్లు తెలిపారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA