Nandipet: సిద్ధాపూర్ గ్రామానికి 'టీబీ ముక్త్' అవార్డు
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామం 'టీబీ ముక్త్' (క్షయ రహిత) గ్రామంగా ఎంపికైంది.
Nandipet: సిద్ధాపూర్ గ్రామానికి 'టీబీ ముక్త్' అవార్డు
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల్ సిద్దాపూర్ గ్రామానికి, టీ. బి ముక్ట్ రహిత గ్రామ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డును సబ్ కలెక్టర్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్రెటరీ, ఆశ వర్కర్లకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ ఈర్పు మహేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు టీ. బి ముక్ట్ భాగంగా నిజామాబాద్, జిల్లా, నందిపేట్ మండల్ లోని మా గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉండడంటూ, ఇంతటి స్ఫూర్తినిచ్చి సహకరించిన మ ఆశ వర్కర్లకు, గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు,
ఈ అవార్డుని సబ్ సబ్ కలెక్టర్ చేతుల మీదగా తీసుకున్నందుకు నాకు సర్పంచ్ గా చాలా గర్వంగా ఉండి, సెక్రెటరీ, ఆశ వర్కర్లకు ఆనంద వ్యక్తం చేస్తున్నాను, ఇకపై గ్రామ ప్రజలకు గ్రామంలో ఎలాంటి పని ఉన్న గాని , నన్ను సంప్రదిస్తే అది తీర్చిదిద్దుతానని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది, అభివృద్ధికి ఇలాగే ముందస్తు ఉండి గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శంగా తీసుకువెళ్దాం అంటూ గ్రామ ప్రజలకు కోరడం జరిగింది.
సిద్దాపూర్ గ్రామ సర్పంచ్:
మా గ్రామానికి టీ. బి. ముక్ట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది, ముందు ముందు గ్రామ ప్రజలు ఇలానే సహకరించి మన గ్రామానికి అభివృద్ధి రూపంలో, ఇతర కార్యక్రమంలో ముందంతు ఉంటూ, మన గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శంగా తీసుకుందాం, అలాగే గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా గాని నా తెలియజేసినచో,ఒక సర్పంచ్ గా నేను ముందు అంటూ ఉంటూ పరిష్కారం తీర్చి దిద్దుతానని గ్రామానికి హెచ్ఎంటీవీ ద్వారా మాట ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రెటరీ,ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.




