Mohammadabad: సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి!
Mohammadabad: కామారెడ్డి జిల్లా మొహమ్మదాబాద్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల రుణ చెల్లింపులపై సమావేశం జరిగింది.
Mohammadabad: సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి!
మొహమ్మదాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి, భవిష్యత్తులో మరిన్ని రుణాలు పొందేలా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఐకేపీ సీసీ అంజయ్య సూచించారు.
బుధవారం జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామంలో గతంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల్లో కొన్ని సంఘాల సభ్యులు రుణాలను సక్రమంగా చెల్లించకపోవడంతో, ఏపీఎం వందేమాతరం సూచనల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల సభ్యులతో మాట్లాడిన అధికారులు, తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లించాలని కోరారు.
రుణాలను సక్రమంగా చెల్లించడం ద్వారా సంఘాల క్రెడిట్ రికార్డు మెరుగుపడి, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని వారు వివరించారు. సభ్యులు రుణ చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయకుండా సంఘాల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఐకేపీ సీఏ సంగీత,గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి, సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




