Jukkal: విద్యార్థుల కోసం బస్ షెల్టర్ 'సేవన్ హిల్స్' ప్రవీణ్ రెడ్డి ఉదారత!

Jukkal: జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేయనున్న సేవన్ హిల్స్ ప్రవీణ్ రెడ్డి.

VEERANNA, JUKKAL
Published on: 10 Sept 2026 10:30 AM IST
Jukkal
X

Jukkal: విద్యార్థుల కోసం బస్ షెల్టర్ 'సేవన్ హిల్స్' ప్రవీణ్ రెడ్డి ఉదారత!

Jukkal: జుక్కల్‌ (కామారెడ్డి ) మండల,నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్‌లోని రుద్రపహాడ్‌ సమీప ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థుల ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. కళాశాల వద్ద సరైన ఆర్టీసీ బస్‌ స్టాప్‌ లేకపోవడంతో బస్సులు ఆగకవిద్యార్థులుతీవ్రఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన బాన్స్‌వాడ పట్టణంలోని సేవన్‌ హిల్స్‌ యాజమాన్యం ప్రవీణ్‌రెడ్డి సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు.

విద్యార్థులసౌకర్యార్థం కళాశాలసమీపంలో బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేస్తామని ప్రవీణ్‌రెడ్డి హామీఇచ్చారు.విద్యార్థులసమస్యను అర్థం చేసుకుని వారి ప్రయోజనం కోసం బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రవీణ్‌రెడ్డికి కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలతరఫునఅధ్యాపకులు, విద్యార్థులు కలిసి ప్రవీణ్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బస్వాపూర్‌ సర్పంచ్‌ వి. రమణ, సురేష్‌ గొండ, పెద్ద గుల్ల సర్పంచ్ మాధవ్ రావ్ దేశాయ్, జుక్కల్ ఉప సర్పంచ్ ఫిర్దోష్,జుక్కల్‌ మాజీ సర్పంచ్‌ బాంపెల్లి రాములు సెట్‌, బోడ్కె హన్మంత్ తో పాటు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story