Banswada: శ్రీ రుక్మిణి విట్టలేశ్వరాలయంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు!

Banswada: బాన్సువాడ పట్టణంలోని శ్రీ రుక్మిణి విట్టలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 25 July 2026 5:40 PM IST
Banswada
X

Banswada: శ్రీ రుక్మిణి విట్టలేశ్వరాలయంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శ్రీ రుక్మిణి విట్టలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో పురోహితుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కళకళలాడగా, భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు బారులు తీరారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ విశేష పూజలు భక్తిపారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగాయి.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story