Bodhan: శిక్షణ తర్వాత విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

Bodhan: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రైడర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పదో తరగతి పేద విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

K RAVI, BODHAN
Published on: 16 May 2026 1:42 PM IST
Bodhan
X

Bodhan: శిక్షణ తర్వాత విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

నిజామాబాద్ జిల్లా: బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వేసవి తరగత ఉచిత శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన తోట్ల గంగారం ఎల్ఐసి కూతురు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హనుమాడ్లు ప్రణీత పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు శనివారం అల్పాహారం పంపిణీ చేశారు. రైడర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంతో పదవ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా గణితంలో మెలకువలు, ఇంగ్లీష్ బోధన అందిస్తున్నారు. సుమారు 100 మంది విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తోట్ల గంగారం సూచించారు. రైడర్స్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా తమ వంతు సహకారాన్ని అందించాలని ఉద్దేశంతో తన కూతురు ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైడర్స్ నిర్వాహకులు విద్యార్థులు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story