Jukkal: 161 జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ అక్కడికక్కడే మృతి!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ సమీపంలో 161వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది.

VEERANNA, JUKKAL
Published on: 4 Sept 2026 3:55 PM IST
Jukkal
X

Jukkal: 161 జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ అక్కడికక్కడే మృతి!

జుక్కల్ (కామారెడ్డి): హైదరాబాద్ నుండి బిచ్కుంద వైపు ఉదయం 6 గంటల 40 నిముషాలకు బయలు దేరిన హైదరాబాద్ -1 డిపోకు చెందిన TG 35Z0030 ఆర్ టి సి బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో ని 161 జాతీయ రహదారి పై కేంరాజ్ కల్ల లి గేట్ సమీపనికి చేరుకోగానే ప్రమాదవశత్తు కాల్వర్ట్ ను డికొని ప్రమాదనికి గురైంది.

అదుపుతప్పిన ఆర్ టి సి బస్సు రహదారి పక్కన ఉన్న కాల్వర్ట్ ను డికోట్లడడం బోల్తా పడింది. ప్రమాద సమాయం లో బస్సులో మొత్తం 13మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా బస్సు డ్రైవర్ ఆంజినేయులు (దేవర కర్ర )అక్కడికక్కడే మృతి చెందరు.

ప్రమాదం లో గాయపడిన 10 మంది ప్రయాణికులను స్థానికులు, అధికారులు సహాయం తో వెంటనే బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘటన స్థలాన్ని బాన్స్ వాడ డి ఎస్ పి విట్టల్ రెడ్డి, సి ఐ రవి కుమార్, పోలీస్ సిబ్బంది చేరుకొని ప్రమాదనికి గల కారణాలు స్థానికులతో వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story