Rudrur: ఎల్లమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే పోచారం

Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

K RAVI, BODHAN
Published on: 12 May 2026 6:24 PM IST
Rudrur
X

Rudrur: ఎల్లమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే పోచారం

Rudrur: డివిజన్ పరిధిలోని రుదురు మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రేణుక ఎల్లమ్మ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల దైవం ఎల్లమ్మ తల్లిని ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించి బోనాలు తీశారు. సుమారు 100 కుటుంబాలు ఉపాసదీక్షలతో అమ్మవారిని మొక్కుకొని చివరి రోజు వైభవంగా కళ్యాణ నిర్వహించారు.

గ్రామం సుఖశాంతులతో ఉండడంతోపాటు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు మొక్కుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొనడంతో ఆయనను గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామస్తులకు అన్నదానం సైతం నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా కొలువదీర్చారు. గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు విట్టల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను గౌడ కులస్తులు జరుపుకున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story