Banswada: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డికి రాఖీ కట్టిన అక్క సత్యవతి!
Banswada: బాన్సువాడలోని తన నివాసంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డికి ఆయన అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆశీర్వదించారు.
Banswada: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డికి రాఖీ కట్టిన అక్క సత్యవతి!
Banswada: రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి కి తన అక్క శ్రీమతి దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆత్మీయంగా ఆశీర్వదించారు.
అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా–తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షా బంధన్ వేడుకను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అన్నా–చెల్లెళ్ల అనుబంధం,అక్కా–తమ్ముళ్ల ఆత్మీయత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




