Nizamabad: నిజామాబాద్ రాష్ట్ర స్థాయికి పోచంపాడ్ గురుకుల విద్యార్థులు

Nizamabad: నిజామాబాద్‌లో జరిగిన అండర్-14 అథ్లెటిక్స్ ఎంపికల్లో సత్తా చాటిన పోచంపాడ్ గురుకుల విద్యార్థులు. 11, 12 తేదీల్లో సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి పోటీలు.

VENU, BALKONDA
Published on: 9 July 2026 2:53 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ రాష్ట్ర స్థాయికి పోచంపాడ్ గురుకుల విద్యార్థులు

నిజామాబాదు: 6-7-2026 సోమవారం రోజున నిజామాబాద్ డిఎస్ఏ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 14 సం లోపు బాలుర విభాగం అత్య-పత్య అసోసియేషన్ సెలక్షన్ లో పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు దిల్ వార్, రిషివర్ధన్, నిహాల్, సుందర్, నిక్షిత్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని, ఈ రాష్ట్ర క్రీడలు ఈ నెల 11,12 వ తేదీలలో సిద్దిపేట్ లో జరుగుతాయని, ప్రిన్సిపాల్ వి మహిపాల్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, దూద్ గామ్ సర్పంచ్ బాబా అభినందించినారు. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర క్రీడలకు ఎంపికయ్యే విధంగా శిక్షణ ఇచ్చిన పాఠశాల పిఈటీ సంజీవ్ ను గ్రామ సర్పంచ్, సంస్థ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయబృందం అభినందించారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story