Jukkal: బిచ్కుందలో ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇవ్వని కార్యదర్శి!
Jukkal: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల్ల గ్రామంలో ఓనర్‌షిప్ సర్టిఫికెట్ జారీ చేయడంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం. ఎంపీడీఓకు బాధితుడి ఫిర్యాదు.
Jukkal: బిచ్కుందలో ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇవ్వని కార్యదర్శి!
Jukkal: బిచ్కుంద(కామారెడ్డి ) "ఓనర్‌షిప్ సర్టిఫికెట్ "జారీ విషయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శినిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారంటూ బిచ్కుంద మండలం రాజుల్ల గ్రామానికి చెందిన ఓబాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలు ఉన్నప్పటికీ సర్టిఫికెట్ జారీ చేయకుండా కార్యదర్శిఇష్టానుసారంగావ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు బాధితుడు వినతిపత్రం సమర్పించారు. ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం పలుమార్లు కార్యదర్శిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని వినతిలో పేర్కొన్నారు.
పైఅధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందాల్సిన ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం జారీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బాధితుడు పేర్కొన్నారు. తన సమస్యను వెంటనే పరిశీలించి, ఓనర్‌షిప్ సర్టిఫికెట్ జారీ చేసేలా పంచాయతీ కార్యదర్శికి పైఅధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అర్హతకలిగినదరఖాస్తుదారులనుఅనవసరంగాకార్యాలయాల చుట్టూ తిప్పకుండా,నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.




