Kamareddy: విద్యుత్ సమస్యపై రోడెక్కిన నిజాంసాగర్ రైతన్నలు!

Kamareddy: నిజాంసాగర్ మండలంలో విద్యుత్ కొరతపై రహదారిపై బైఠాయించిన రైతన్నలు. NH-161 పై ధర్నా, పోలీసుల హామీతో ట్రాఫిక్ పునరుద్ధరణ.

VEERANNA, JUKKAL
Published on: 12 Sept 2026 3:59 PM IST
Kamareddy
X

Kamareddy: విద్యుత్ సమస్యపై రోడెక్కిన నిజాంసాగర్ రైతన్నలు!

Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోనినర్సింగరావుపల్లి,మంగుళూరు, వెల్గనూరు గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ అందక పంటలకు సాగునీరు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీ అమలుకావడం లేదని, రోజుకు ఐదారు గంటలు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడంతో మోటార్లు పనిచేయడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం మంగుళూరు గేటు వద్ద జాతీయ రహదారి-161 పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు.

విద్యుత్ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL